ముథోల్
బాసర: గోదావరి నదిలో మునిగిన భక్తులను కాపాడిన గంగపుత్రులు
భద్రాచలానికి చెందిన ఆరుగురు భక్తులు సరస్వతి అమ్మవారి దర్శనానికి మంగళవారం బాసరకు వచ్చారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా, ఇద్దరు భక్తులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. గమనించిన మిగతా కుటుంబ సభ్యులు వెంటనే అక్కడ ఉన్న గంగపుత్రులకు సమాచారం అందించారు. వెంటనే వారు మునిగిన భక్తులను కాపాడి బయటకు తీసుకువచ్చారు. వారి ప్రాణాలను కాపాడిన గంగపుత్రులను పలువురు అభినందించారు.