పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు షాక్ ఇచ్చిన బీసీసీఐ
పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ షాక్ ఇచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పాకిస్థాన్‌కు వెళ్లేది లేదని పీసీబీకి బీసీసీఐ తేల్చి చెప్పింది. భద్రతా కారణాల రీత్యా అక్కడికి రాలేమని పేర్కొంది. కాగా ఇప్పటి వరకు భారత్ తమ దేశానికి వస్తుందని పాకిస్థాన్ ఊహిస్తోంది. దీనిపై బీసీసీఐ స్పష్టత ఇవ్వడంతో దుబాయ్‌లో హైబ్రిడ్ విధానంలో మ్యాచులు నిర్వహించాలని పీసీబీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.