కౌకుంట్ల: ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుంది: ఎమ్మెల్యే
కౌకుంట్ల మండలం పేరూర్ లో గురువారం నిర్వహించిన గ్రామసభలో తెలంగాణ ఇన్ చార్జ్ విశ్వనాథన్ తో కలిసి దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఒక్కొక్కటిగా ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుంది. ఒక్క పేరూర్ గ్రామంలోనే రైతులకు రూ. 93, 97, 594/- రుణమాఫీ చేసాం. 259 ఇండ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 422 కుటుంబాలకు 500లకే సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నామని అన్నారు.