

సికింద్రాబాద్: బాత్రూమ్లో గొంతు కోసుకుని వ్యక్తి ఆత్మహత్య
సికింద్రాబాద్ చిలకలగూడ మేడిబావిలో సోమవారం విషాదం జరిగింది. మాసాబ్ ట్యాంక్‌లోని పవర్‌గ్రిడ్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న నర్సింగ్ రావు అనే వ్యక్తి బాత్రూమ్లో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారించగా.. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.