

సికింద్రాబాద్: చర్చిలో పాస్టర్ పగడాల భౌతికకాయం
హైదరాబాద్ తిరుమలగిరి సమీపంలోని ఎస్బీహెచ్ కాలనీకి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి మిస్టరీగా మారుతోంది. రాజమండ్రి నుంచి రాజానగరం బయలుదేరిన అయన రాజమహేంద్రవరం దగ్గరలో చనిపోయి కనిపించడం అనుమానాస్పదంగా మారింది. ఇది ముమ్మాటికీ హత్య అంటూ పలు క్రైస్తవ సంఘాలు, పార్టీలు ఆందోళన చేపట్టాయి. పోస్టుమార్టం అనంతరం సికింద్రాబాద్ చర్చిలో ఆయన భౌతికకాయాన్ని సందర్శనార్థం ఉంచారు.