జనగామలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
జనగామ పట్టణంలోని స్థానిక గాయత్రి గార్డెన్స్ లో సోమవారం ప్రభుత్వ అధికారులచే క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, జనగామ ఆర్డీఓ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే జరుపుకునే అతి పెద్ద పండుగా క్రిస్మస్ పండగ అన్నారు. అనంతరం నాయకులు, పాస్టర్లు ఆర్డీఓ తో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేశారు.