ఆలేరు నియోజకవర్గం
దరఖాస్తులను పెండింగ్ లేకుండా త్వరగా పరిష్కరించాలి
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా త్వరగా పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన 18 దరఖాస్తులను స్వీకరించారు. అందులో రెవిన్యూ శాఖ 6, జిల్లా పంచాయతీ అధికారి 4,జిల్లా ఎంప్లాయ్మెంట్ 3, డిఇఇ హౌసింగ్, మున్సిపాలిటీ, అటవీ శాఖ, పోలీస్ శాఖ, ఆరోగ్యశాఖ నుంచి ఒక్కొక్కటి చొప్పున రావడం జరిగింది.