కిషన్ రెడ్డి పెద్ద రాజకీయ నాయకుడేం కాదు: మంత్రి కోమటిరెడ్డి (వీడియో)
TG: మూసీ కష్టాలంటే ఏమిటో నల్లగొండ జిల్లా ప్రజలను అడిగితే చెబుతారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. అధికారం పోయినా BRS నేతల్లో అహంకారం తగ్గలేదని మండిపడ్డారు. రాజకీయాల కోసం రెచ్చగొట్టగానే రెచ్చిపోవడానికి నల్లగొండ ప్రజలేం అమాయకులు కాదని చెప్పారు. ఇంకా కిషన్ రెడ్డి పెద్ద రాజకీయ నాయకుడేం కాదు, ఆయన గురించి మాట్లాడటం దండగ అని ఎద్దేవా చేశారు.