ఈ నెల 16నుంచి ఉద్యమం ఉదృతం
వైద్య విభాగంలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులకు వేతన బకాయిలు చెల్లించి కార్మికులపై వేధింపులు ఆపాలని మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎల్. వి రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నర్సీపట్నం ఏరియా వైద్య విభాగ ఒప్పంద కార్మికుల సంఘం అధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జి ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా రమణ మాట్లాడుతూ ఈనెల 16 నుంచి ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు.