మదనపల్లెలో అనధికార టమోటా మండీలను తొలగించండి
మదనపల్లిలో టమోటా మార్కెట్ యార్డు లో అనధికారికంగా ఏర్పాటు అయిన టమోటా మండీలను వెంటనే తొలగించాలని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష అధికారులను ఆదేశించారు. సోమవారం ఎమ్మెల్యే టమోటా మార్కెట్ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు ఆయనతో మార్కెట్ యార్డులో అనధికారికంగా టమోటా మండీలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. అనధికార మండీలను తొలగించి అధికారికంగా ఉన్న మండీలను కొనసాగించాలని కార్యదర్శిని ఆదేశించారు.