కొమరగిరి పట్నంలో క్రీడా పోటీలను ప్రారంభించిన కలెక్టర్
అల్లవరం మండలంలోని కొమరగిరిపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద నిర్వహించిన అల్లవరం మండల స్థాయి క్రీడా పోటీలను కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలోనూ రాణించాలని ఉద్దేశంతో ప్రభుత్వం క్రీడా పోటీలను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ క్రీడా పోటీలను ఆసక్తి కలిగిన క్రీడాకారులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.