పిఠాపురం: జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలి
కూటమి ప్రభుత్వం కల్పించిన 3 శాతం క్రీడాకోటాను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ ఎన్ వర్మ ఆకాంక్షించారు. పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ లో పదో తరగతి చదువుతున్న మహాలక్ష్మి ఇటీవల కాకినాడలో జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ రగ్బీ పోటీల్లో ప్రతిభతో జాతీయ స్థాయికి ఎంపికైంది. దాంతో సోమవారం ఆమెను తెదేపా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ సత్కరించారు.