బాపట్ల: వసతి గృహాలను తనిఖీ చేసిన కమిషనర్
బాపట్ల పట్టణ పరిధిలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను సోమవారం మున్సిపల్ కమిషనర్ జి. రఘునాథ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బి. సి. బాలికల వసతి గృహం, బి. సి బాలుర వసతి గృహం, యస్. సి బాలికల వసతి గృహాలను తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు పట్టిక పరిశీలించి విద్యార్థులకు వడ్డించే భోజన పదార్థాల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. మరుగుదొడ్లను పరిశీలించి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండాలని సిబ్బందికి సూచించారు.