మహిళా విద్యాభివృద్ధికి పూలే కృషి ఎనలేనిది: బాపట్ల ఎమ్మెల్యే
మహాత్మ జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా గురువారం బాపట్ల పట్టణంలోని చీల్ రోడ్డు వద్ద ఉన్న విగ్రహానికి బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, కూటమి శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పూలే చేసిన సేవలను కొనియాడారు. మున్సిపల్ కమిషనర్ రఘునాథ రెడ్డి, నాయకులు తాతా జయప్రకాష్ నారాయణ, పమిడి భాస్కర్ రావు పాల్గొన్నారు.