బాపట్లలో జన జాతీయ దినోత్సవ వేడుకలు
బాపట్ల కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం గిరిజన సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జన జాతీయ గౌరవ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి, డిఆర్ఓ గంగాధర్ గౌడ్, ఆర్డీవో గ్లోరియా పాల్గొన్నారు. గిరిజన పోరాట సమరయోధుల చిత్రపటాలకు వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిరిజన జాతుల విముక్తి కోసంపోరాడి అసువులు బాసిన నాయకుల పోరాటపటిమిని కొనియాడారు.