

లింగాల: "హామీలు అమలుచేయలేని సీఎం చంద్రబాబు"
ఇచ్చిన హామీలను అమలు చేయలేని సీఎం.. చంద్రబాబు అని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి విమర్శించారు. లింగాల మండలం చిన్నకుడాలలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాశ్ మాట్లాడుతూ ప్రజలు వైఎస్ జగన్ పాలనకు, చంద్రబాబు పాలనకు తేడా గమనించాలన్నారు. కడప జిల్లా వ్యాప్తంగా అధికార పార్టీ అండదండలతో జూదం విపరీతంగా పెరిగిపోయిందన్నారు.