
లింగాల: ఉత్సాహంగా కుందేళ్ల పార్వేట
లింగాలలో ఉగాది పౌర్ణమి రోజున కుందేళ్ల పార్వేట కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. మంగళవారం ఎగువ లింగాల రామాలయం నుంచి డప్పు, మేళాలతో సీతారామ, లక్ష్మణ ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పల్లకిలో ఉంచి పట్టుబడిన కుందేళ్లను పొలాల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ పట్టుబడిన కుందేళ్లను వదిలి మళ్లీ పట్టుకునేందుకు పిల్లలు యువకులు పరుగులు తీశారు. ఈ విధంగా చేయడంవల్ల వర్షాలు బాగా కురిసి పంటలు పండుతాయని ప్రజల నమ్మకం.