కర్నూలు జిల్లాలో 14 మంది ఎక్సైజ్ సీఐలకు స్థానచలనం
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఎక్సైజ్ స్టేషన్లు, చెక్ పోస్టులకు విజిలెన్స్ విభాగాల్లో పనిచేస్తున్న 14 మంది సీఐలకు స్థానచలనం కలిగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో సోమవారం కోడుమూరు ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు నందికొట్కూరుకు బదిలీ అయ్యారు. దీంతో ఆయనను ఎక్సైజ్ పోలీసు సిబ్బంది ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. అనంతరం సీఐ మాట్లాడుతూ 8 నెలల కాలంలో తనకు సహకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు.