గోస్పాడు గ్రంథాలయంలో బాలల దినోత్సవ వేడుకలు
గోస్పాడు గ్రంథాలయం నందు గ్రంథాలయ అధికారి వజ్రాల భవాని ఆధ్వర్యంలో ఎంఈఓ అబ్దుల్ కరీం బాలల దినోత్సవ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం కృషి చేయాలన్నారు. అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు.