శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో ఘనంగా వార్షిక పవిత్రోత్సవాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కాశీగా, భూకైలాసంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కార్యక్రమంలో ధార్మిక తత్పురుషుడు మార్కెట్ ప్రసాద్ పాల్గొన్నారు. వీరు శ్రీకాళహస్తి ఆలయానికి అన్నదానం కోసం అను నిత్యం ఉచితంగా కూరగాయలను సరఫరా చేస్తుంటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకోవడం తన పూర్వ జన్మ సుకృతం అని శనివారం తెలిపారు.