ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయండి నంద్యాల కలెక్టర్
ఉపాధి హామీ పనుల్లో వేతనదారుల సంఖ్యను పెంచి నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఏపీఓ, ఎంపీడీఓ లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపాధి హామీ లక్ష్యాలు, ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై సమీక్షించారు. డ్వామా పిడి జనార్దన్ రావు, హౌసింగ్ పిడి వెంకట సుబ్బయ్య, ఈఈ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.