రైతులతో జీవామృతం ద్రావణం తయారు
ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతులలో జీవామృతం వినియోగం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చునని, ఎపిసిఎన్ఎప్ మెంటర్ ఎం పద్మావతి తెలిపారు. శనివారం మండలంలోని లక్ష్మీనర్సుపేట గ్రామంలో సేంద్రియ వ్యవసాయం సాగు చేపడుతున్న రైతు వూణ్న ఫకీరు వరి పంట పొలం పరిశీలించారు. పంటలో వేయడానికి అవసమైన జీవామృతం ద్రావణం తయారు చేశారు. వీటి ఉపయోగాలు మెంటర్ పద్మావతి వివరించారు .ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు వంకల.వెంకటరమణ, లంక చందూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.