సదాశివపేట: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సదాశివపేట డిగ్రీ కళాశాల ప్రసాద్ అన్నారు. డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు శనివారం నిర్వహించారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలని పేర్కొన్నారు. బదిలీపై వెళ్లిన అధ్యాపకులను సన్మానించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సిద్ధులు పాల్గొన్నారు.