
నల్గొండ: ప్రశాంతంగా ముగిసిన పరీక్ష
ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున కళాశాలలో నిర్వహించిన గ్రామ పాలన అధికారుల పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష ప్రారంభమైన వెంటనే జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ కలిసి గ్రామ పాలనాధికారుల పరీక్షను తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటిండెంట్ ఇన్విజిలేటర్లతో పరీక్ష తీరు తెన్నులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పరీక్షకు హాజరైన వారు, గైర్హాజరైన వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు.