ముథోల్
కుబీర్: ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడి మృతి
ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. తానూర్ మాండలం ఎల్వికి చెందిన రాజ్ రతన్ (22) బంధువుల ఇంటికి కుబీర్ మండలం సాంవ్లికి వచ్చాడు. గ్రామ శివారులోని చెరువులో గురువారం సాయంత్రం స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి శుక్రవారం చెరువులో తెలాడు. మృతుడి తండ్రి గంగాధర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.