జైలు నుంచి జానీ మాస్టర్ విడుదల.. వీడియో
కొరియోగ్రాఫర్‌పై అత్యాచార ఆరోపణలతో చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జైలు నుంచి విడుదలయ్యారు. బెయిల్ మంజూరు కావడంతో శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు కుటుంబసభ్యులు, అభిమానులు స్వాగతం పలికారు. కాగా, లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న జానీ మాస్టర్ కు తెలంగాణ హైకోర్టు ఇటీవల షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.