ముథోల్
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
బైంసా మండలం దేగాంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు శుక్రవారం ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. గ్రామానికి చెందిన నరేశ్(28) కూలీ పనులు చేసుకుంటు కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల భార్య భర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటూ మధ్యానికి బానిసై మధ్యం మత్తులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.