సంగారెడ్డి నియోజకవర్గం
సంగారెడ్డి: ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకార కార్యక్రమం
సంగారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకార కార్యక్రమం వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆదివారం నిర్వహించారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత, మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోపాజి అనంత కిషన్ నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. అధ్యక్షునిగా విద్యాసాగర్, కార్యదర్శిగా నామ భాస్కర్, కోశాధికారిగా ఆమెటి భాస్కర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా పూర్ణచందర్ ప్రమాణస్వీకారం చేశారు.