అభివృద్ధి, ఉద్యోగావకాశాలు లభించాలంటే పరిశ్రమలు స్థాపించాలి: CM
తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే, యువతకు ఉపాధి ఉద్యోగావకాశాలు లభించాలంటే పరిశ్రమలు స్థాపించాలని సీఎం రేవంత్ అన్నారు. అవసరమైన చోట భూ సేకరణ జరగాల్సిందేనని చెప్పారు. భూ సేకరణ చట్టం ప్రకారం తగిన పరిహారం ఇవ్వలేని పరిస్థితి ఉన్నందున, భూ సేకరణ చేసే ప్రాంతాల్లో భూముల విలువ మూడింతలు పెంచాలని CS, కలెక్టర్లకు ఆదేశాలిచ్చామని చెప్పారు. వేములవాడ సభలో నేతన్నలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యార్న్ డిపోను సీఎం వర్చువల్ గా ప్రారంభించారు.