
అమలాపురం రూరల్: మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా రామకృష్ణ
అమలాపురం రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏలేశ్వరపు రామకృష్ణను అధిష్టానం నియమించింది. సోమవారం కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొండేటి చిట్టి బాబు ఆయనకు నియామక పత్రాలు అందించారు. అనంతరం చిట్టిబాబు మాట్లాడుతూ. నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షులు పార్టీని బలోపేతం చేసే దిశగా కష్టపడి పని చేయాలన్నారు.