
అల్లవరం: ఈ నెల 13కు ప్రవేశ పరీక్ష వాయిదా
అల్లవరం మండలం గోడి బాలుర గురుకుల పాఠశాల, కళాశాల ప్రవేశ పరీక్ష ఈ నెల 13వ తేదీకి వాయిదా పడిందని ప్రిన్సిపల్ నక్కా శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఐదవ తరగతికి ఉదయం 10. గంటల నుంచి 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. ఇంటర్లో ప్రవేశానికి మధ్యాహ్నం రెండు గంటల నుంచి 2. 30 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందని చెప్పారు. అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష ఈ నెల ఆరవ తేదీన నిర్వహించాల్సి ఉందన్నారు.