కర్లపాలెం: వైభవంగా కోటి దీపోత్సవం
కర్లపాలెం మండలం కొత్తనందయపాలెంలోని రామాలయం వద్ద శుక్రవారం సాయంత్రం కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి పూజలు చేసి ప్రసాదాలు సమర్పించారు. అనంతరం గ్రామస్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు