బాల్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా బాపట్ల పోలీస్ జట్టు
బాపట్ల పట్టణంలో సోమవారం బాపట్ల క్రికెట్ అసోసియేషన్ వారు నిర్వహించిన "మ్యాచ్ బాల్ క్రికెట్ టోర్నమెంట్" లో జిల్లా పోలీస్ జట్టు విజేతగా నిలిచింది. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడి జట్టు సభ్యులను ప్రత్యేకంగా అభినందించి గెలుపొందిన కప్పును, నగదు బహుమతిని వారికి అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారులు జట్టును అభినందించారు.