రామాపురంలో శాంతి సమావేశం నిర్వహించిన డి.ఎస్.పి
వేటపాలెం మండలం రామాపురం గ్రామంలో సోమవారం రాత్రి చీరాల డి. ఎస్. పి మోయిన్ శాంతి సమావేశం నిర్వహించారు. ఈ గ్రామంలోని మత్స్యకారులు రెండు వర్గాలుగా చీలిపోయి ఘర్షణలు పడుతున్న నేపథ్యంలో ఆయన అందరినీ కలిసిమెలిసి జీవించాలనీ సూచించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రూరల్ సీఐ శేషగిరిరావు, ఎస్ఐ చంద్రశేఖర్ పాల్గొన్నారు.