దుద్దేకుంటలో భూమిలో నుంచి బయటపడిన అయ్యప్పస్వామి విగ్రహం
బెళుగుప్ప మండలం దుద్దేకుంటలో అయ్యప్పస్వామి విగ్రహం ఆదివారం తెల్లవారుజామున బయటపడింది. వివరాలు ఇలా ఉన్నాయి దుద్దేకుంట గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి అయ్యప్పస్వామి కలలోకి వచ్చి చెప్పడంతో ఆ వ్యక్తి ముళ్లను తొక్కుతూ వెళ్లి గ్రామ శివారులోని పొలంలో తోవడంతో అయ్యప్ప స్వామి విగ్రహం బయటపడింది. దీంతో గ్రామస్తులంతా భూమిలో నుంచి బయటపడిన విగ్రహాన్ని చూడడానికి పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు నిర్వహించారు.