

ఎస్ కోట మండలంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు
ఎస్ కోట మండలం ఎస్ జి పేట సచివాలయం పరిధిలో శనివారం పశుసంవర్ధక శాఖ అధికారిణి హేమ ఆధ్వర్యంలో ఎస్జీపేట, వినాయక పల్లి గ్రామాల్లో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పాడి పశువులకు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎదకు రాని, చూలు కట్టని ఇతర గర్భ కోశ వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. పశువులకు చూడి పరీక్షల నిర్వహించి రైతులకు శాస్త్రీయ సూచనలు అందించారు.