ఆదిలాబాద్
జైనథ్: ఘనంగా ముగిసిన బతుకమ్మ నిమజ్జన వేడుకలు
జైనథ్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో శనివారం సాయంత్రం బతుకమ్మల నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మహిళలు యువతులు డిజే పాటల నడుమ ఆడి పాడారు. ఈ సందర్భంగా డప్పు చప్పుల్ల నడుమ గ్రామంలో బతుకమ్మలతో మహిళలు శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం గ్రామ సమీప వాగులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.