ప్రేమజంటను స్తంభానికి కట్టేసి కొట్టారు (వీడియో)
యూపీ ఖుషీనగర్ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. 20 ఏళ్ల యువకుడు, 18 ఏళ్ల యువతి ప్రేమించుకున్నారు. వారి బంధాన్ని గ్రామ ప్రజలు అంగీకరించలేదు. దీంతో ఈ ప్రేమికులు బయటకు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ జంటను గ్రామ ప్రజలు పట్టుకుని దారుణంగా శిక్షించారు. యువతి జుట్టు కత్తిరించారు. అంతేకాకుండా వారిని స్తంభానికి కట్టి కొట్టారు. పోలీసులు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు.