Top 10 viral news 🔥
చనిపోతే ఒక్క క్షణం.. సీఎం చంద్రబాబు ఎమోషనల్
బాలకృష్ణ అన్‌స్టాపబుల్ సీజన్ 4లో మొదటి గెస్ట్‌గా ఏపీ సీఎం చంద్రబాబు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. 'అరెస్ట్ చేసిన రాత్రి నంద్యాల నుంచి అడవుల్లో ఇన్వెస్టిగేషన్ పేరుతో తిప్పి తెల్లారి మెడికల్ టెస్టులకు తిప్పారు. ఆ రాత్రి చేయని తప్పుకు అరెస్ట్ చేయడం, ఆ చేసిన విధానం చూసి గుండె తరుక్కుపోయింది. చనిపోతే ఒక్క క్షణం.. అనుకున్న ఆశయం కోసం పనిచేస్తే అది శాశ్వతం. చావు గురించి ఆలోచిస్తే జీవితంలో ఏది చేయలేము' అని సంచలన వ్యాఖ్యలు చేశారు.