మంచిర్యాల
మందమర్రి: పాఠశాలలో పిచ్చి మొక్కలు, చెట్లు తొలగించాలి
మందమర్రి: క్యాతనపల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ పట్టణంలోని సుభాష్ నగర్ లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పిచ్చి మొక్కలు, చెట్లు తొలగించాలని గురువారం ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకులు నందిపాటి రాజు, కల్లూరి క్రాంతి కుమార్ మాట్లాడుతూ పాఠశాలలో ఏపుగా పిచ్చి మొక్కలు పెరగడంతో పాములు సంచరించే ప్రమాదం ఉందని తెలిపారు.