దేవరకద్ర నియోజకవర్గం
దేవరకద్ర: రోడ్లు మార్గాన కురుమూర్తికి సీఎం.. మారిన షెడ్యూల్
కురుమూర్తి దేవాలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్డు మార్గాన రానున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి మహబూబ్ నగర్ జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులకు శనివారం సాయంత్రం సమాచారం అందింది. పేదల తిరుపతిగా పేరుగాంచిన చిన్న చింతకుంట మండలంలోని కురుమూర్తి దేవాలయం వద్ద రూ.110 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఘాట్ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టిన అనంతరం స్వామివారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకోనున్నారు.