దేవరకద్ర నియోజకవర్గం
దేవరకద్ర: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన దేవరకద్ర నియోజకవర్గంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. కొత్తకోట మండలం మీరాశిపల్లి స్టేజి దగ్గర జాతీయ రహదారి-44పై ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.