కస్టమర్ తిట్టడంతో డెలివరీ బాయ్ సూసైడ్
తమిళనాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఫుడ్ డెలివరీ బాయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. బి.కామ్ చదువుతున్న పవిత్రన్ కొరట్టూరు ప్రాంతంలో ఆలస్యంగా ఫుడ్ డెలివరీ చేయడంతో మహిళా కస్టమర్ అతడిని తిట్టి, ఫుడ్ డెలివరీ సంస్థకు ఫిర్యాదు చేసింది. రెండు రోజుల తర్వాత కస్టమర్ ఇంటిపై అతడు రాయితో దాడి చేశాడు. దీంతో ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఈ వరుస ఘటనలతో డిప్రెషన్లోకి వెళ్లిన పవిత్రన్ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.