ఖానాపూర్
కడెం: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలి: డీఈఓ
విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు ఆదేశించారు. ఆదివారం కడెం మండలంలోని కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులను పాఠశాల పరిసరాలను పరిశీలించారు. వంటగదిని పరిశీలించి అక్కడ నిల్వ చేసిన కూరగాయలు వంట సామగ్రిని పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సూచించారు