ముథోల్
భైంసాలో మద్యం మత్తులో వ్యక్తి వీరంగం
మద్యం మత్తులో బస్సును వెళ్లనీయకుండా నడిరోడ్డుపైనే కొద్దిసేపు పడుకొని ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. సోమవారం బైంసా పట్టణంలోని గాంధీ గంజ్ ఎదుట మహారాష్ట్రలోని పాలజ్ గ్రామానికి వెళ్తున్న బస్సుకి అడ్డంగా రోడ్డుపై ఓ వ్యక్తి పడుకొని బస్సును వెళ్లనీయకుండా కొద్దిసేపు రోడ్డుపైనే పడుకున్నాడు. ఎంతకి జరగకపోవడంతో ప్రయాణికులు విసుగు చెందారు. రోడ్డుపై వెళ్తున్న కొందరు ఆ వ్యక్తిని లేపి బస్సు పంపించారు.