ఖానాపూర్
ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: మంత్రి సీతక్క
ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. శనివారం రాత్రి ఉట్నూర్ ఎమ్మెల్యే బొజ్జుతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. ఐటీడీఏ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించేలా దృష్టి పెడతున్నామని, మిగిలిన సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు.