నిర్మల్
పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలి
మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలని డిఎస్పి నిర్మల్ జిల్లా ఇన్చార్జి జగన్మోహన్ డిమాండ్ చేశారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వరంగల్ నగరంలోని దేశాయిపేట ప్రధాన కూడలిలోని మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారని వెంటనే వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు.