ప్రణాళికబద్ధంగా ధాన్యం సేకరణ చేపట్టాలి
జిల్లాలో 2024-25 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కు సంబంధించి ధాన్యం సేకరణ ప్రక్రియను ప్రణాళికబద్ధంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణకు అనుసరించాల్సిన విధానాలపై జిల్లా అధికారులతో గురువారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్. జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాతో కలిసి జిల్లా ధాన్యం కొనుగోలు కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.