విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై కొలువై ఉన్న అమ్మవారిని ఆదివారం హోం మంత్రి అనిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆలయం మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం కల్పించారు. అనంతరం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు, పూజ కార్యక్రమం అనంతరం అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలను ,ప్రసాదాలను, అమ్మవారి యొక్క చిత్రపటాన్ని అందించారు.