అల్లు అర్జున్‌కు విజయ్ దేవరకొండ గిఫ్ట్.. థాంక్స్ చెబుతూ బన్నీ ట్వీట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు 'పుష్ప' పేరుతో ప్రింట్ చేసిన రౌడీ బ్రాండ్ టీ షర్ట్‌లను గిఫ్ట్‌గా పంపారు. వాటికి సంబంధించిన ఫోటోను అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ 'నా స్వీట్ బ్రదర్.. నీ ప్రేమకు కృతజ్ఞతలు' అని పేర్కొన్నారు. ''లవ్ యూ అన్నా.. మన సంప్రదాయాలు కొనసాగుతాయి'' అని విజయ్ ఆ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' చిత్రం డిసెంబరు 5న విడుదల కానున్న నేపథ్యంలో ఆయనకు విజయ్ ఈ కానుకను పంపారు.